ఆడ బిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు….

ఆడ బిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆడబిడ్డలకు ఆత్మగౌరవంగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తున్నాయని పట్టణ సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు కొత్త బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు.
లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, సిద్ది రామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ భూమయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మద్దూరి రవి, నాయకులు మహిపాల్ రెడ్డి, రామచంద్రం, ఉప్పరి సాయిలు, దాబా సురేష్, బాపురెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
