నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
- జక్కా మహబూబ్ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డిలు శనివారం మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన వేల్పుగొండ వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు.
అనంతరం 25 కేజీల బియ్యం,రూ.3వేల రూపాయలు నగదు అందజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.పేద బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో చికటయపాలెం,మడిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు దిండి వీరన్న, వెన్నెం సోమిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల వెంకటరెడ్డి, పల్లె దయాకర్, సింగం దామోదర్, ముత్తయ్య,వల్లపు రాఘవులు, మహంకాల సంపత్, చిన్న వెంకన్న, సాధిక, వెంకటేశ్వర్లు,యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
