పోలీసుల అదుపులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
పోలీసుల అదుపులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎంపీలు బోయిన్ పల్లి వినోద్ కుమార్, మాలోతు కవితలను రఘునాథపల్లి పోలీసులు కోమల్ల టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రఘునాథపల్లి సర్కిల్ కార్యాలయంకు తరలించారు. సీఐ శ్రీనివాస్ రెడ్డితో పాటు నర్మెట సీఐ అబ్బయ్య, స్థానిక ఎస్ఐ డి. నరేష్, పలువురు ఎస్సైలు వారిని అదుపులోకి తీసుకొని ఆఫీసులో ఉంచారు.
