కృత్రిమ కొరతతో పెట్రోల్..

కృత్రిమ కొరతతో పెట్రోల్..

నంద్యాల వాహనదారుల కష్టాలు….
బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లో పెట్రోల్ డీలర్లు కృతిమ కొరత సృష్టిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతున్నారు. జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణం పలు ప్రాంతాలలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరా యి. ముందస్తు ప్రకటనలు లేకపోవడం వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల ముందు తాళ్లను కట్టి ఆపేస్తున్నారు.

గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కరోజులో ఈ మార్పు రావడం ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తెలిసిన పట్టించుకోవటం లేదు. పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర సేవల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బంకుల వద్ద ఇంధనం పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారు.

దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగి, ప్రధాన రహదారులపై రద్దీ అధికమైంది. ఇంతటి సమస్య నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు లేకపోవడం, సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే సమాచారం లేకపోవడం ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తక్షణమే ఇంధన సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

పట్టణం లోని పలు పెట్రోల్ బంకులు దగ్గర స్వల్ప ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి…మోటార్ సైకిల్ దారుల తో ఇబ్బందులు లేకున్న ట్రాక్టర్, తో లారీ, ట్రక్, ఆటో వాళ్ళు అధిక సంఖ్యలో డీజిల్, పెట్రోల్ అడుగుతుండడంతో గొడవలు జరుగుతున్నాయి. పోలీస్ లు ప్రవేశిస్తే తప్ప చక్క దిద్దడం సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply