ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి…

ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి…
- డిప్యూటీ తాసిల్దార్ కు వినతి
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నిర్వహిస్తున్న జనగణన శిక్షణా తరగతులను ఎండల తీవ్రత కారణంగా ఒక పూటకు కుదించాలని టీజీటీఎటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.
గురువారం శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఉట్నూర్ డిప్యూటీ తహసీల్దార్ అమృత్ లాల్‌కు వారు వినతిపత్రం అందజేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల శిక్షణలో పాల్గొనే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు జాదవ్ ఉత్తమ్, రాథోడ్ దత్తరాం, రాథోడ్ గోవింద్, శీతారాం, సుఖేందర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
