రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు

రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు
తహసీల్దార్ కి బిఆర్ఎస్ నాయకుల వినతిపత్రం
మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీలోని ధర్మపురంలోని పలు కుటుంబాలపై రాజకీయ కక్షతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యలేదని రేషన్ కార్డ్ లు, పెన్షన్లు తొలగించారని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు జంగ శ్రీను అన్నారు. ఏకపక్ష రాజకీయ కక్షలతో ఫిర్యాదు చెయ్యడాన్ని నిరసిస్తూ.. పార్టీ నాయకులు తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందికి గురి చెయ్యాలనే ఉద్దేశంతో ధర్మపురం గ్రామానికి సంబంధం లేని ఆగంతకులతో కలెక్టర్ కు ఫిర్యాదు ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఏకపక్ష చర్యలు తీసుకోవద్దన్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ లోని 12 వార్డ్ లల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు , భూస్వాములు, పెద్ద పెద్ద వ్యాపారులు సైతం పెన్షన్లు, రేషన్ కార్డ్ లు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి సైతం ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారని వారిని ముందుగా గుర్తించి నిజాయితీగా అందరివి తొలగించాలని తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లు కొణతం యాకుబ్ రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, 10 వ వార్డ్ కౌన్సిలర్ నల్ల మధు, జిల్లా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ సభ్యులు దాసరి తిరుమలేష్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీను, కూరెళ్ల పరమేష్, కంచర్ల క్రాంతికుమార్ రెడ్డి, నల్ల ప్రభాకర్, అన్నదాసు విద్యాసాగర్, దాసరి నరేష్, కూరెళ్ల రమేష్, రుద్రపెల్లి గణేష్, చుక్క అశోక్, దాసరి ఏలెండర్, బందెల శ్రీను, ధర్మపురం గ్రామస్తులు వర్రే రాములు, ఎర్రోజు యశ్వంత్, అశోక్, తాడూరి అనంతరెడ్డి,రాజశేఖర్ రెడ్డి, జటంగి పరుశరాములు, హనుమంత్, నల్ల మల్లయ్య, తడూరి భూపాల్ రెడ్డి, గద్దగుటి నర్సయ్య, జటంగి అశోక్, చీరబోయిన సోమయ్య, రాములు, ఏనుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
