BRS | పూర్తిస్థాయి నివేదిక వచ్చాక చర్యలు తప్పవు

BRS | పూర్తిస్థాయి నివేదిక వచ్చాక చర్యలు తప్పవు

BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌కు మేలు జరిగిందని భావించి సంతోషపడొద్దని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. తుది తీర్పు వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడతాయని అన్నారు.

ఘోష్ కమిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ అనుకూలంగా భావించడం సరైంది కాదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

ప్రస్తుతం కోర్టు తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే ఆదేశాలు జారీ చేసిందని, దీనిని పూర్తిస్థాయి విజయమని భావించడం తగదన్నారు. తుది తీర్పు వెలువడిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల అవినీతి బయటపడుతుందని దయాకర్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాజకీయంగా మరింత చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.

Leave a Reply