రఘునాథపల్లిలో డీసీసీబీ నూతన బ్రాంచ్ ప్రారంభం
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. రైతులు, మహిళలకు ఆర్థికంగా బలంగా నిలబడేందుకు ఇటువంటి బ్యాంకింగ్ సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
రఘునాథపల్లిలో బ్యాంకు బ్రాంచ్ ప్రారంభం కావడం సంతోషకరమని, స్థానికులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ డీసీసీబీ ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థగా ప్రజాసేవలో, ముఖ్యంగా రైతు సేవలో ముందంజలో ఉండడం సంతోషకరమని తెలిపారు. ఈకార్యక్రమంలో డిసిసిబి బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్, నాబార్డ్ డిడిఎం చంద్రశేఖర్, నాబార్డ్ డిడిఎం చైతన్య రవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ బొల్లం ఉమారాణిరాజీవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
