ఉపాధి హామీ పనుల్లో ప్రజాప్రతినిధులు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగ పూర్ పంచాయతీకి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లు పూదరి సునీత, రాజన్న తో పాటు బిజెపి ఓబీసీ మండల అధ్యక్షులు ఇప్ప మధుకర్ లు మంగళవారం ఉపాధిహామీ పనులకు వెళ్లి పనులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కల్పిస్తుంది జాతీయ ఉపాధి హామీ పథకంతో ఉపాధి కలుగుతుందని తాము కూడా ప్రజలకు సేవలు అందిస్తూ స్వయం ఉపాధి కోసం ఉపాధి కూలి పనులు చేస్తున్నట్లు వారు తెలిపారు. మంచి కలుగుతుందని వారు తెలిపారు. ఉపాధి హామీ పథకం ఎంతో దోహదపడుతుందని వారి తెలిపారు. వారు ఉపాధి హామీ పనులకు వెళ్తూ ఉపాధి కోసం పనులు చేసే తప్పు లేదని ఆదర్శంగా నిలుస్తున్నారు.
