Students | జేఈఈ మెయిన్ ఫైన‌ల్ కీ రిలీజ్‌

Students | జేఈఈ మెయిన్ ఫైన‌ల్ కీ రిలీజ్‌

Students | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదలైంది. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఆన్స‌ర్ల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. మ‌రికాసేప‌ట్లో ఎన్‌టీఏ ఫ‌లితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలకు దాదాపు 11.23లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.06 లక్షల మంది పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) పరీక్ష రాయగా.. దాదాపు 55వేల మంది పేపర్‌ -2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే.

జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలను జనవరిలో నిర్వహించి ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ నెల మొదటి వారంలో జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు నిర్వహించిన ఎన్‌టీఏ అధికారులు.. పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసి ఏప్రిల్‌ 13 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వీటి ఆధారంగా తుది ఆన్సర్‌ కీ రూపొందించి సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. జేఈఈ మెయిన్ రెండు విడతల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని జాతీయ ర్యాంకులను ప్రకటించనున్నారు.

Leave a Reply