కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ..

కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ..

  • దయాకర్ రావు స్ఫూర్తితో.. శ్రీనివాస్ రెడ్డి సాయం

రాయపర్తి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా నిలుస్తుందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైస వెంకటేశం కుమార్తె మైస రాణి జీవనమనగడను తెలుసుకున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి కష్టకాలంలో వారికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ఆపదలో అండగా నిలవడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, మండల పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply