కరీంనగర్ మేయర్ ను కలిసిన బిజెవైయం నాయకుడు శరత్ కుమార్

కరీంనగర్ మేయర్ ను కలిసిన బిజెవైయం నాయకుడు శరత్ కుమార్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : నగర పాలక ఎన్నికల్లో తొలిసారిగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కిం చుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా నూతనంగా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొలగాని శ్రీనివాస్‌ను బిజెవైయం రాష్ట్ర నాయకుడు కొలనుపాక శరత్ కుమార్ కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మేయర్ కు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి ఆయన నాయకత్వంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply