కేర్ డెంటల్ కాలేజీకి పీజీ సీట్ల మంజూరు..

కేర్ డెంటల్ కాలేజీకి పీజీ సీట్ల మంజూరు..

నాలుగు విభాగాల్లో 12 సీట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…
గుంటూరు విద్యా రంగానికి మరింత బలం..
హెల్త్ యూనివర్శిటీ వీసీని కలిసిన కాలేజీ ప్రతినిధులు..

విజయవాడ, ఆంధ్రప్రభ : గుంటూరులోని కేర్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ అండ్ డెంటల్ సైన్సస్ కు 2026-27 విద్యా సంవత్సరానికి డెంటల్ పీజీ సీట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు విభాగాల్లో 12 పీజీ సీట్లు ఆమోదించబడటం గుంటూరు విద్యా రంగానికి ప్రోత్సాహకరంగా మారింది. మాక్సిలోఫేషియల్ సర్జరీ, ప్రోస్థోడాంటిక్స్, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ, ఆర్థోడాంటిక్స్ విభాగాల్లో ప్రతి విభాగానికి మూడు చొప్పున సీట్లు కేటాయించారు. దీతో కాలేజీలో ఉన్నత విద్యావకాశాలు మరింత విస్తరించనున్నాయి.

ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ డాక్టర్ రసూల్, డైరెక్టర్ మొహిద్దీన్, ప్రొఫెసర్ డాక్టర్ మెహబూబ్ షేక్ కలిసి విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కాలేజీకి పీజీ సీట్లు మంజూరైన విషయంపై వీసీ డాక్టర్ చంద్రశేఖర్ వివరాలు అందజేసినట్లు తెలిపారు. ఈ మంజూరు ద్వారా రాష్ట్రంలో డెంటల్ ఉన్నత విద్యకు మరింత అవకాశాలు కలుగుతాయని కాలేజీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Leave a Reply