స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర పై ర్యాలీ..

స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర పై ర్యాలీ..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆది నారాయణ మాట్లాడుతూ జల వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి వసతుల కల్పన కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, పచ్చదనం పెరుగుదల వంటి అంశాలతో పాటు, కళాశాలలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర పై విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పరమేష్, అర్థశాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ అయ్యన్న, రాజనీతి శాస్త్ర ఉపన్యాసకులు సిరాజ్ అలీ ఖాన్, డాక్టర్ రమేష్ బాబు, సుధాకర్, ఆంజనేయులు, నాగేంద్ర, పిడి ప్రశాంత్, రమేష్ పాల్గొన్నారు.
