జలధార-జలహారతిలో భాగంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌..

జలధార-జలహారతిలో భాగంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌..

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర జలధార – జల హారతి కార్యక్రమం భాగంగా పేరూరు చెరువు వద్ద నీటి సంరక్షణకు సుస్థిర ఆంధ్రకు మార్గం అనే కార్యక్రమం చేప‌ట్ట‌డం జ‌రిగింది. భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “జలధార-జలహారతి”. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు..

శనివారం స్థానిక చంద్రగిరి నియోజకవర్గం పేరూరు చెరువు వద్ద స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతిలో ఎం ఎల్ ఎ పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం “జలధార-జలహారతి”. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుందనీ అన్నారు. ప్రభుత్వం జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా నీటి నిల్వలు పెరిగి… వ్యవసాయానికి, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్నది ఎండాకాలం… వేసవి తాపానికి ప్రజలు, రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు.. 100 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో చెరువులను, నీటి కుంటలను కాపాడుకుంటూ నీటి వనరులను పెంచుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

చెరువు కట్ట సంరక్షణకు, జల వనరుల శాఖ అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. స్వయంగా ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంలో కలెక్టర్ ఎక్కించుకొని చెరువుగట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, జల వనరుల శాఖ ఈ ఈ వెంకటేశ్వర ప్రసాద్, సాగునీటి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply