TG CM | బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్

TG CM | బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్
TG CM | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ… దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని ఆయన అన్నారు. విపక్షాల ఐక్యతతోనే కేంద్రం ఓడిందని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ ఓటమి కాదని, బీజేపీ విధానలకు జరిగిన ఓటమి అని అన్నారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. చిన్న సవరణలతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారని వ్యాఖ్యానించారు.
2023 మహిళా బిల్లును యథావిధిగా అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. అలా చేస్తే ఇండి కూటమి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చేందుకు రెడీ ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి ఉందని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందో ప్రజా క్షేత్రంలో తేలుతుందన్నారు. యూపీ ఎన్నికలలోపు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. సోమవారం నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేసినా మద్దతిస్తామన్నారు. రాజకీయ అధికారం మీ దగ్గర ఉండొచ్చు.. ఆర్థిక వనరులు మాత్రం మా దగ్గర నుంచి మీకు అందున్నాయనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దని రేవంత్ అన్నారు. మాకు దేశం ముఖ్యం.. రాజకాయీలు కాదన్నారు. మహిళా రిజర్వేషన్లకు సోమవారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఓటు హక్కు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అన్నారు. ఇందిరా గాంధీ లాంటి గొప్ప నేతలు దేశాన్ని నడిపించారని గుర్తు చేశారు. బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఇప్పటివరకు ఒక్క మహిళకు దక్కలేదని విమర్శించారు.
