పిల్లర్ బ్రిడ్జ్, అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి
పిల్లర్ బ్రిడ్జ్, అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి
- నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతి
- మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ లో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోఎలివేటెడ్ పిల్లర్ బ్రిడ్జి తో పాటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని కోరుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. చౌటుప్పల్ పట్టణ అభివృద్ధి, వ్యాపార రంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుత ప్రణాళికలో ఉన్న ఆర్ ఈ వాల్స్, వియూపి ల స్థానంలో పిలర్లపై ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలో రహదారి పక్కన విస్తృతంగా నివాసాలు, వ్యాపార సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆర్ ఈ వాల్స్ వల్ల నివాస ప్రాంతాలు, వ్యాపారాల మధ్య విభిన్నత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పిల్లర్లపై ఎలివేటెడ్ నిర్మాణం చేస్తే పట్టణానికి అనుకూల వాతావరణం, సులభ రవాణా, వ్యాపార కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందని వివరించారు. ప్రత్యేకంగా బస్టాండ్ ప్రాంతంలో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని, అక్కడ అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఇది ప్రయాణికులకు సురక్షిత మార్గం కల్పించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన అధికారులకు వివరించారు. ప్రజల నుంచి కూడా ఎలివేటెడ్ కారిడార్, అండర్‌పాస్ ఏర్పాటుకు విస్తృతంగా అభ్యర్థనలు వస్తున్నాయని, ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా అధికారులను కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తాడూరి పరమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, రాజరత్నం, యాదయ్య, మాజీ సర్పచ్ ఎం దయాకరాచారి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఉడుగు మల్లేష్, తోర్పునూరి మల్లేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మున్నా, భీమగోని మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బిజేపి నేత మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో
చౌటుప్పల్ పట్టణంలో నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం ను ఎలివేటెడ్ క్యారిడార్ గా మార్చాలని, బస్టాండ్ దగ్గర వెహికల్ అండర్ పాస్ నిర్మాణం చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మునుగోడు అసెంబ్లీ ఇన్చార్జ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
రీజినల్ ఆఫీసర్ శివశంకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
దీనికి సానుకూలంగా స్పందించిన రీజినల్ ఆఫీసర్ చౌటుప్పల్ పట్టణంలోని బస్టాండ్ దగ్గర వెహికల్ అండర్పాస్ ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తొందర్లో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రమనగోని శంకర్, శాగ చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పర్నె శ్రీను రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, బుడ్డా సురేష్, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
