అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో అర్హులైన లబ్ధిదారులకు అందించాలని డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. 99 రోజుల ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడంతో పాటు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులనువేగవంతం చేయాలన్నారు. స్థానికసమస్య లకు తక్షణ పరిష్కారం చేయడంలో అధికారులు ప్రజాప్రతినిధు లు చొరవచూపాలన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు,ఉచిత బస్సు రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లులు అర్హులకు అందిస్తుందన్నారు.
99 రోజుల ప్రణాళికలో భాగంగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించుటకు ఇదొక సదా అవకాశమన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు ప్రమాద బారిన పడకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని మోటార్ సైకిల్ ఉన్న ప్రతి వ్యక్తికి సేఫ్టిసైడ్ హెల్మెట్ ను దరించాలని ఎలిమెంట్ ధరిస్తే ప్రమాదాల నివారణను తగ్గించుకోవచ్చని ఎస్ఐ కృష్ణయ్య అవగాహన కల్పించిప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సరోజ పావని, తోపాటు మండల స్థాయి అధికారులు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
