మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం..

మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం..
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య..
దండేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామీణాభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు పని చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొని ఆయన మాట్లాడారు.కొంతమంది గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. గ్రామసభలో భాగంగా పలువురు పలు సమస్యలపై ఆయనకు విన్నవించుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇల్లు కట్టుకున్న లబ్దిదారుల కు వెంట వెంటనే బిల్లు వచ్చే ఏర్పాటు చేయాలని అన్నారు. కొన్ని శాఖలకు సంబంధించిన సమస్యలను అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వెంటనె పరిష్కరించాలని సూచించారు.
వివిధ శాఖల అధికారులు వారి శాఖలో చేస్తున్న పనులపై అదనపు కలెక్టర్ కు వివరించారు, గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు, గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, దుర్గప్రసాద్, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపిడివో జాగర్లమూడి ప్రసాద్, సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్, వ్యవసాయ అధికారి, గోర్ల అంజిత్ కుమార్, ఇజిఎస్ ఏపిఓ ప్రసాద్, ట్రాన్సకో ఏ ఈ బాపు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అల్లంల అనిత, ఐకెపి ఎపియం తోట లక్ష్మీ, డాక్టర్, స్నేహిత, మిషన్ భగీరథ ఏ ఈ అస్మిత, మాజీ ఎంపిపి గడ్డం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, కంది హేమలత సతీష్, కొంగల నవీన్ ఆయా గ్రామాల సర్పంచ్ లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
