పెద్దూరులో త్రీఫేస్ విద్యుత్తుకు శ్రీకారం..

పెద్దూరులో త్రీఫేస్ విద్యుత్తుకు శ్రీకారం..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూరు గ్రామంలో విద్యుత్ శాఖ కడెం మండలం ఏఈఎమ్ రాంసింగ్ సబ్ ఇంజనీర్ స్వాతి కడం టౌన్ ఏఎల్ఎంఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన విద్యుత్ కరణ పనులను బుధవారం ప్రారంభించడం జరిగిందని పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ అన్నారు. పెద్దూరు గ్రామంలో సింగిల్ ఫేస్ విద్యుత్తు లైన్ ను తీసివేసి త్రీఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అలాగే ఎక్స్ టెన్షన్ లైన్ పనులను పునరుద్ధరించడం జరిగిందన్నారు.
దీంతో పెద్దూరు గ్రామంలో వంద శాతం నూతన విద్యుత్తుకరణ పనులు పూర్తి కావడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే మండల కేంద్రమైన కడెంలో వచ్చేవారం సింగిల్ ఫేస్ లైన్ తీసివేసి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం, విద్యుత్తు లైన్ ఎక్స్టెన్షన్ పనులు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తీసివేసి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం నూతన విద్యుత్ కరుణ పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, జిపి వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
