ప్రైవేట్ పార్కింగ్ లో అగ్ని ప్రమాదం

ప్రైవేట్ పార్కింగ్ లో అగ్ని ప్రమాదం

  • ఎగిసిపడ్డ మంటలు… కాళీ బూడిదైన బస్సు టైర్లు
  • దట్టమైన పొగతో స్థానికుల్లో భయం

జనగామ, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో నిలువ ఉంచిన పాత టైర్లకు నిప్పుంటుకొని దగ్ధమైన సంఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని దయనిలయం సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు పార్కింగ్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుని పార్కింగ్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పాత బస్సు టైర్లకు మంటలు అంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో దట్టమైన నల్ల పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది.

ఈ పొగ సమీపంలోని ఇండ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారు వెంటనే బయటకు పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తమై ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు . అగ్నిప్రమాదం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనీ. అయితే పెద్ద మొత్తంలో టైర్లు దగ్ధమైనట్లు స్థానికుల తెలుపుతున్నారు..

పార్కింగ్ లో నిల్వ చేసిన పాత టైర్లుకు ప్రమాదవశాత్తు మంట నుంచుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు పార్కింగ్ స్థలంలో పార్క్ చేసే వాహనాల కు పార్కింగ్ యాజమాన్యాలు భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply