HYD | కుటుంబ కలహాలే కారణమా…?

HYD | కుటుంబ కలహాలే కారణమా…?

HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న తన తమ్ముడిని హత్య చేశాడు.

హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు హుస్సేన్‌ను అన్న హషీం హుస్సేన్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply