రోడ్డు ప్రమాదాల నివారణ కు విద్యార్థులచే అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణ కు విద్యార్థులచే అవగాహన
- ట్రాఫిక్ నియమావళి పై ప్రతిజ్ఞ
- పరకాల పోలీసుల ఆధ్వర్యంలో
పరకాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పరకాల పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పరకాల సీఐ వి. క్రాంతి కుమార్ నేతృత్వంలో ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద విద్యాలయ పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమావళి పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ ట్రాఫిక్ నియమాలి ఉల్లంఘన చేయకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు ప్రతి వాహనాదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యాలయ పాఠశాల పి ఈ టి సుధీర్, డ్యాన్స్ మాస్టర్ అనిల్, ప్రభుత్వ బాలుర పాఠశాల పీఈటీ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
