ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు…

ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు…

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు సూర్యసత్య చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి, అనంతరం చలివేంద్రాన్నిప్రారంభించి బాటసారులకు మజ్జిగ, స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యసత్య చారిటబుల్ ట్రస్ట్ సంస్థ 2014 సంవత్సరంలో ప్రారంభమైందని తెలిపారు.

సంస్థ ప్రారంభం నాటి నుండి నేటి వరకు విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కార్యాలయంలో ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహించి రోగులకు వైద్యులు ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారని కొనియాడారు. సూర్యసత్య చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థను నేడు ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించడానికి ప్రధాన కారణం తమ సంస్థ ప్రతినిధులైన రాజగిరి భాస్కరరావు, రాజగిరి చంద్రశేఖర రావు, రాజగిరి శ్రీనివాస్ రావు, రాజగిరి పవన్ కుమార్ అనే తెలిపారు.

కరోనా సమయంలో ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం విజయవాడ నగరానికి వచ్చిన వరదల్లో ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించామని తెలిపారు.రానున్న రోజుల్లో కూడా తమ సంస్థ సేవలు మరింతగా విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబుజి (బాబ్జి) , జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు మండలి రాజేష్, అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కె ఎస్ ఎన్ మూర్తి, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, నగర ఉపాధ్యక్షులు కామళ్ళ సోమనాథం, కృష్ణ పెన్నా రీజియన్ కో ఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు కొంపల్లి నాని, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply