ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి…

ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి…
మంత్రి వివేక్ వెంకటస్వామి…
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమనపల్లి లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం విద్య అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటులో భాగంగా సోమనపల్లిలో చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
జూనియర్, సీనియర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు, అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాల నిర్మాణంలో 3 బదిలీలలో పనులు చేయించాలని, 400 మంది కార్మికులతో పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణానికి కావలసిన సామాగ్రి, ఇసుక ఇతర అన్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఈనెల 28వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు పాఠశాలకు సంబంధించి అన్ని పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం సంబంధిత పటాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
