మద్యం మత్తులో డ్రైవ్ చేసి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు..

మద్యం మత్తులో డ్రైవ్ చేసి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు..

  • హెల్మెట్ భారం కాదు.. రక్షణ కవచం
  • బాధ్యతగా డ్రైవ్ చేయండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి
  • ఎస్సై ముత్యం రాజేందర్

రాయపర్తి, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు రాయపర్తి మండల కేంద్రంలో ఎస్సై ముత్యం రాజేందర్ ఆధ్వర్యంలో “ఆరైవ్ – అలైవ్ ” నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదటగా మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో, ముఖ్యఅతిథిగా ఎస్సై ముత్యం రాజేందర్ పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై ముత్యం రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలతో చెలగాటమాడుతూ కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగుల్చుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా ధరించడం వలన మన ప్రాణాలకు రక్షణ కవచంగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరించి, ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించి బాధ్యతగా డ్రైవ్ చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక యువతచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply