వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యం

వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యం
–విద్యార్థులుకష్టపడిచదివి ఉన్నతస్థాయికిచేరుకోవాలి.
–చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యతఇవ్వండి.
–ఆహారంపోషకాహారంతో కూడి ఉండేలాచూడాలి.
–నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యార్థుల భవిష్యత్తు దృశ్య వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని l జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహంలోని బాత్రూమ్‌లు, నివాస గదులు, వంటశాల తదితర సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థులు బాత్రూమ్‌లను ప్రతిరోజూ సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో సమావేశమై వారి దినచర్య గురించి తెలుసుకుని, చదువుపై దృష్టి సారించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, శారీరక మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతో అవసరమని అన్నారు.
తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వంటల నాణ్యత, ఆహారపు మెనూ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం పోషకాహారంతో కూడి ఉండేలా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా వీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ…
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ..
విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని అన్నారు. క్రమశిక్షణతో జీవనం గడిపితే జీవితంలో విజయాలు సాధించవచ్చని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలకు ఎస్.ఎ.రైటింగ్ లో పాల్గొన్న పిల్లలకు ప్రైజ్ లు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక, ఈ.డి.ఎస్.సి.కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్, తహసీల్దార్ చింత రవి, ఎస్సై రమేష్,పరమేశ్, వెంకటేశ్ వార్డెన్, సి.ఐ, ఎస్.ఐ.సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
