515medicinesonly | ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. రోగులపై పెరుగుతున్న భారం

515medicinesonly | ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. రోగులపై పెరుగుతున్న భారం
515medicinesonly మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు
అవసరమైన మందుల్లో భారీ లోటు
బడ్జెట్ ఉన్నా అమలు లోపాలు
నిల్వల లోపంతో పెరిగిన సమస్య
పేద రోగులపై అదనపు భారం
515medicinesonly ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, హృద్రోగాలు, మానసిక సమస్యలు, గాయాలు, ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన ఔషధాలు, సర్జికల్ సామగ్రి అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీఎచ్సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీఎచ్సీలు), జిల్లా, ప్రాంతీయ, బోధనాసుపత్రుల్లో కూడా ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది.

ఉమ్మడి జిల్లాల సెంట్రల్ డ్రగ్ స్టోర్ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా అవుతున్నప్పటికీ, ప్రస్తుతం అవసరమైన 712 రకాల మందుల్లో కేవలం 515 రకాలే అందుబాటులో ఉన్నాయి. దీంతో 197 రకాల ఔషధాలు కొరతలో ఉండటంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎర్పడింది.
డ్రగ్ స్టోర్లలో లేని మందులను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సెకండరీ హెల్త్ విభాగాల పరిధిలోని ఆసుపత్రులు తమకు కేటాయించిన 20 శాతం డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన ఆసుపత్రులు అభివృద్ధి నిధులను వినియోగించి మందులను సమకూర్చుకుంటున్నాయి. అయినప్పటికీ, అనేక చోట్ల ఈ సౌకర్యం సరిగా అమలుకాకపోవడంతో రోగులపై అదనపు భారం పడుతోంది.
సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో సాధారణంగా మూడు నెలలకు సరిపడా నిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం సరిపడా నిల్వలు లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే ఔషధాల కొనుగోలుకు వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అవసరానికి తగ్గ సరఫరా లేకపోవడం గమనార్హం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులు ఉచిత వైద్యం పొందలేక, తమ ఖర్చులతో బయట మందులు కొనాల్సిన విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
