బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి..

బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి..
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా, సమాజ సేవకు ప్రతీకగా నిలిచిన జ్యోతిరావు పూలే ఆశయాలను స్మరించుకుంటూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు.మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు అంటే సమానత్వం, విద్య, సామాజిక న్యాయం అని, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పేదల అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని, అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం ద్వారా సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, దేవరపు మాల్యాద్రి,పిరియా సోమేశ్వరర్రావు జగదాంబ, ఇప్పిలి రాంమోహన్,టోపి రఘు,మరకా శ్రీనివాసరావు, కంచేటి నాగరాజు, డిడి నాయుడు,రాజానా బంగారు నాయుడు,డోల జనార్దన్, దొడ్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
పి.4ద్వారా తోపుడు బండి అందజేత. బంగారు కుటుంబం పి.4పధకం ద్వారా పలువురికి తోపుడు బండ్లను టీడీపీ యువ నాయకులు బొండా సిద్దార్ధ, రవితేజలు అందజేశారు.
