చిట్యాలలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంలో ( ఒకటో వార్డు ) మహాత్మ జ్యోతిబా పూలే యొక్క 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘసంస్కర్త అని.. దళిత అణగారిన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన మార్గదర్శకుడు అని తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1948 లో స్త్రీల విద్య కై పూణేలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు.

కుల వ్యవస్థ అంటరానితనము.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సత్యశోధకు సమాజ్ 1973 లో ఏర్పాటు చేసి సామాజిక సమానత్వం కోసం కృషి చేశాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ నెంబర్ రుద్రవరం యాదయ్య, రుద్రవరం దశరథ బీసీ నాయకులు ఎడ్లమాలింగం, రుద్రవరం సహదేవుడు గంగాపురం లింగస్వామి, రుద్రవరం కుమార్, రుద్రవరం మధు, రుద్రవరం శ్రీకాంత్, రుద్రవరం నవీన్, గాద యాదమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply