Telangana | ఆరు అంతస్తుల భవనం కూల్చివేత

Telangana | ఆరు అంతస్తుల భవనం కూల్చివేత
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో ప్రభుత్వ భూములపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ భారీ ఆపరేషన్ కొనసాగిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
ఐలాపురం తండా సహా గ్రామంలో పేదల నివాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగించిన ముఖీమ్ గెస్ట్‌హౌస్‌ను కూల్చివేసింది. అలాగే ముఖీమ్ సోదరుడు అజీమ్ నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేసింది.
ఈ చర్యలలో భాగంగా ఖాళీగా ఉన్న భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఐలాపూర్ ప్రాంతంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 860 ఎకరాలను రక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూముల విలువ సుమారు రూ.15వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమణలపై హైడ్రా కఠినంగా వ్యవహరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
