TG | 16 మందికి గాయాలు

TG | 16 మందికి గాయాలు
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
గాయపడిన వారిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
