ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మునుగోడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని బీరెల్లిగూడెం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ దాసరి గోవర్ధన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.

రైతులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కేంద్రాలకు తీసుకువచ్చి అమ్మాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దోటి వెంకటేశ్వర్లు,ఏ ఈ ఓ మాధగోని నరసింహ, పంచాయతీ కార్యదర్శి చిరుమర్తి వెంకన్న,సి ఆర్ పి దీపిక,సిసి కోరే యాదయ్య,విబికె వసంత,మహిళా సంఘం అధ్యక్షురాలు ఊర్మిళ,వార్డు సభ్యులు మహారాజ్,శంకర్,మల్లేష్,సుజాత,తారకమ్మ, గ్రామ పెద్దలు దాసరి రాములు,వెంపల్ల నరసింహ,దాసరి సత్యనారాయణ,ఐతగోని అశోక్,వెంపల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply