ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్

ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్

  • అవినీతి ఆరోపణలే కారణం
  • విధుల్లో అలసత్వం, బాధ్యత రహిత్యంతో వేటు

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో అవినీతి అక్రమాలకు పాల్పడే పోలీస్ అధికారులపై పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నారు.పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని కొత్వాల్ సందేశం పంపిస్తున్నారు. పోలీసులుగా బాధ్యతాయుతంగా పని చేయక పోతే సస్పెషన్ వేటు తప్పదని తన చర్యలతో చాటి చెబుతున్నారు. వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎసైగా విధులు నిర్వహిస్తున్న సతీష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో అలసత్వం వహించినట్లుగా అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో ఎసైని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇసుక అక్రమ రవాణా విషయాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నట్టు సదరు ఎసై సతీష్ పై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఠాణాకు వచ్చే బాధితుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా సమ్మక్క సారాలమ్మ ఆగ్రామ్ పహాడ్ జాతర సమయంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన పంచాయితీ కారణంగా ఇదే ఠాణాలో పని చేసే ఎసైపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.

Leave a Reply