3% Tcs Share Falls : ప్ప్​.. లాభాలొచ్చినా..Andhra Prabha News

3% Tcs Share Falls : ప్ప్​.. లాభాలొచ్చినా..Andhra Prabha News

  • టీసీఎస్​ షేర్​ డ్రాప్​
  • ఇన్వెస్టర్లలో ఆందోళన
  • క్యూ4 ఫలితాల అంచనాల్లో ఒత్తిడి
  • వార్షిక ఆదాయంలో అరుదైన క్షీణత
  • నికర లాభంలో డబుల్ డిజిట్ వృద్ధి
  • భారీ డివిడెండ్ ప్రకటన
  • మెగా డీల్స్‌తో కంపెనీ దూసుకుపోతున్నా…
  • AI సేవల్లో టీసీఎస్ పురోగతి
  • బ్రోకరేజీ సంస్థల జాగ్రత్త సూచనలు
  • ఐటీ రంగంపై మిశ్రమ సంకేతాలు

( ఆంధ్రప్రభ, ముంబై ప్రతినిధి)

భారత్​ టెకీ కంపెనీల్లో ప్రముఖ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేరు ధర 3% దిగజారింది. ₹2,502 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, వార్షిక ఆదాయంలో అరుదైన క్షీణత ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.

3% Tcs Share Falls : లాభాలొచ్చినా….

3% Tcs Share Falls

నిన్నటి క్లోజింగ్ ధర ₹2,589తో పోలిస్తే ఈరోజు ప్రారంభం నుంచే ఒత్తిడికి లోనైంది. క్యూ4 ఫలితాలు బాగున్నా, ఆర్థిక సంవత్సరానికి (FY26) డాలర్ ఆదాయం 2.4% తగ్గింది, ఈ స్థితిలో ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. టీసీఎస్ చరిత్రలో ఇది అరుదైన పరిణామం. మార్చి 2026తో ముగిసిన త్రైమాసికం) నికర లాభం ₹13,718 కోట్లు కాగ, గత ఏడాదితో పోలిస్తే 12.2% వృద్ధి సాధించింది. కంపెనీ ఆదాయం ₹70,698 కోట్లు చేరింది. అంటే వార్షిక వృద్ధి 9.6% అన్నమాట.
ఒక్కో షేరుకు ₹31 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో $ 1200 కోట్ల భారీ ఒప్పందాలను (Mega deals) దక్కించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవల వార్షిక ఆదాయం $230 కోట్లు దాటింది.
ఎబిట్ (EBIT) మార్జిన్ 25.3% వద్ద స్థిరంగా ఉంది, ఇది గత నాలుగేళ్లలో అత్యధికం. ఇక క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడం , కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండటంతో స్వల్పకాలిక వృద్ధిపై బ్రోకరేజ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ ” Repo Rate Unchanged : రెపో రేటు య‌థాత‌థం Andhra Prabha News

Leave a Reply