నరసరావుపేటలో ఐదు లక్షల చోరీ

నరసరావుపేటలో ఐదు లక్షల చోరీ
సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నరసరావుపేట రూరల్ పోలీసులు చోరీ ఘటనపై విచారణ
నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్కూటీ డిక్కీలో ఐదు లక్షలు నగదు చోరీకి గురైన ఘటన నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామానికి చెందిన అన్నా వెంకట సత్యనారాయణ నరసరావుపేటలోని తన బంధువులకు చెందిన బంగారు షాపులో ఐదు లక్షల రూపాయల నగదును అప్పుగా తీసుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో ఇంటిలోకి అవసరమైన ఉల్లిపాయలు తీసుకునేందుకు జొన్నలగడ్డ గ్రామ సమీపంలో ఉల్లిపాయల హోల్ సేల్ షాప్ వద్ద స్కూటీని ఆపి ఉల్లిపాయలు తీసుకునేందుకు షాపులోకి వెళ్లింది.
ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి కాసేపు స్కూటీ వద్ద తారిటలాడి స్కూటీ డిక్కీ లోని 5 లక్షల రూపాయలు నగదును చోరీ చేశాడు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
