Leave Iran : ఇండియా అలెర్ట్ Andhra Prabha Mews

Leave Iran : ఇండియా అలెర్ట్ Andhra Prabha Mews

  • ఇరాన్ లో వ‌ద్దు..
  • వచ్చేయండి
  • భారతీయులకు అత్యవసర హెచ్చరిక
  • ఇరాన్‌లో వేల సంఖ్యలో భారతీయులు
  • విద్యార్థులు, మత్స్యకారుల తరలింపు చర్యలు
  • కోమ్ నగరంలో అధికంగా భారతీయుల నివాసం
  • సురక్షిత మార్గాలపై విదేశాంగ శాఖ సూచనలు
  • ఎంబసీ హెల్ప్‌లైన్ ఇదే… +98 912 810 9115

( ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ ప్ర‌తినిధి)

కాల్పుల విరమణ నేపథ్యంలో, ఇరాన్‌లోని భారతీయులు త్వరగా ఇరాన్ నుంచి బయటపడాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా దేశం విడిచి బయటకు రావాలని సూచించింది. భద్రతా పరిస్థితిపై ఆందోళనల మధ్య ఈ చర్య తీసుకున్నారు. “భారత పౌరులు ఇరాన్ నుండి వేగంగా వైదొలగాలని గట్టిగా సూచిస్తున్నాం” అని అధికారులు పునరుద్ఘాటించారు.

Leave Iran : 10000 సైగా భార‌తీయులు

ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ విరామ సమయంలో, అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 9,000 నుంచి 10,000 మంది భారతీయులు ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా భారతీయ విద్యార్థులుగా ఉన్నారు. ప్రధానంగా వైద్య విద్య (MBBS) కోసం ఇరాన్‌కు చేరుకున్నారు. ఇటీవల ఏప్రిల్ మొదటి వారంలో ప్ర‌త్యేక ఆపరేషన్ లో 845 మంది విద్యార్థులను సురక్షితంగా తరలించారు. గల్ఫ్ ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన సుమారు 345 మంది మత్స్యకారులు ఉన్నారు.

Leave Iran : ఇప్పటికే కొంద‌రు ఇండియాకు రాక‌

వీరిని తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాల నుంచి ప‌విత్ర కోమ్ (Qom) న‌గ‌రంలో ఉన్నారు. ఇక వ్యాపార‌లు, టెకీలు టెహ్రాన్ ఇతర పారిశ్రామిక నగరాల్లో వ్యాపారవేత్తలు, ఇంజనీర్లు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఉన్నారు. ఇరాన్ నౌకాశ్రయాలలో నౌకల్లో పనిచేసే భారతీయ కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. ఎక్కువ మంది భారతీయులు రాజధాని టెహ్రాన్‌కు సుమారు 150 కి.మీ దూరంలోని కోమ్ నగరంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అత్య‌ధిక మంది భార‌తీయులు ఉన్నారు.

Leave Iran : హెల్స్ లైన్ ఇదే

భారత విదేశాంగ శాఖ (MEA) తాజా సూచ‌న మేర‌కు ఇరాన్‌లోని ఎంబసీ అధికారులు సూచ‌న‌ల మేర‌కు అర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా సురక్షిత మార్గాల్లో స్వ‌దేశానికి రావాల‌ని భార‌త విదేశాంగ శాఖ అధికారులు కోరారు. మ‌రింత స‌మాచారం కోసం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను (+98 912 810 9115) సంప్రదించాలని కోరారు. .

Leave a Reply