అడవిలో నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవు…

అడవిలో నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవు…

-తాళ్లపేట రేంజర్ సుష్మారావు…

దండేపల్లి, ఆంధ్రప్రభ : అడవి ప్రాంతంలో నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తాళ్లపేట అటవీశాఖ అధికారిణి సుష్మారావు అన్నారు, దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారని, వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఇప్పటికే దాదాపు అన్ని గిరిజన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న మన్నారు.

తాళ్లపేట అడవి ప్రాంతం పరిధిలోని దాదాపు అరవై శాతం గుట్టలతో నిండి ఉండడంతో అగ్నిప్రమాదల నియంత్రణ సవాలుగా మారుతుందని అన్నారు. అడవి ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగితే అడవి ప్రాంతం తోపాటు వన్యప్రాణులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. రాత్రి వేళల్లో అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వన్యప్రాణులకు హాని కలగకుండా పని చేటున్నారని అన్నారు.

అడవిలో ప్రాంతంలో సుమారుగా ఒకొక్క గుట్ట 700ల అడుగులఎత్తు ఉన్నాయని వాటి పైన మంటలు ఆర్పేయ్యడం చాలా ప్రమాదం గా ఉందని తెలిపారు.రాత్రి వేళ ఎవరైనా అటవీ ప్రాంతంలో కనబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply