గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర

గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం రూరల్ మండలం పోతిరెడ్డిపాలెం గ్రామపంచాయతీలో రాష్ట్ర భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో గ్రామస్తుల సమస్యలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే ప్రధాన దెయ్యం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మచిలీపట్నం ప్రాంతంలో సమ్మర్ స్టోరేజ్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు రూ. 8 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో మంచినీటి సరఫరాలో ఉన్న ఇబ్బందులను అధిగమించి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Leave a Reply