ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..!

ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..!
నర్సంపేట. ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రభుత్వంలో రైతుల పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. పరిగి నియోజకవర్గం కళాపూర్ రాపోలు రైతుల భూములు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తప్పు పట్టారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం కళాపూర్, రాపోల్ రైతుల భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 1200 వందల ఎకరాల భూమిని కోల్పోతున్న రైతులను పరామర్శకు వెళ్తున్న క్రమంలో హరీష్ రావును అరెస్ట్ చేయడం అత్యంత సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన మంత్రులు, ముఖ్యమంత్రి అండతో నిత్యం చేస్తున్న మైనింగ్, భూముల దందాలను అసెంబ్లీలో బయట మీడియాలో ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు కోకాపేటలోని వారి ఇంట్లో గృహనిర్బంధం చేసి పోలీసులు అరెస్టు చేయడాన్ని పెద్ది ఖండిస్తున్నట్లు తెలిపారు.
మార్పు పేరుతో అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల భూములను కబ్జాలు చేయడంతో పాటు అక్రమంగా మైనింగ్ దందాలు చేస్తున్నదనీ ఆరోపించారు. కబ్జాలను, అక్రమ దందాలను అరికట్టవలసిన ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతిపక్షాలను గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడాన్ని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అదిలాబా ద్ లో ఎవ్వరినీ అక్రమ అరెస్టులు చేస్తలేము అని చెప్తూనే నేడు ఈ అరెస్టులకు పాలుపడడం హేయమైన చర్య అన్నారు. వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ పార్టీ నేతలు చేస్తున్న భూ కుంభ కోణాలను వెలికితీస్తూ భూమిని కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తున్న హరీషన్న అదే క్రమంలో పరిగి కి కూడా వెళ్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా రైతులకు రైతు భరోసా రాక, రుణమాఫీ చేయక, ఎరువులను సకాలంలో అందించకుండా రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరిగోసకు గురిచేస్తున్నద న్నారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి, అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేస్తున్నదనీ పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీల గురించి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులా,మీ తాటాకు చప్పుళ్లకు బిఆర్ఎస్ నాయకులు అదిరేది, బెదిరేది లేదన్నారు.మాకు పోరాటాలు, ఉద్యమాలు, కేసులు, జైల్లు అరెస్టులు కొత్త కావు,పోలీసుల బలం ఉపయోగించి, ప్రతిపక్షా లను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం అని మండిపడ్డారు.
