పారాక్వాట్ డైక్లోరైడ్ మందు అమ్మితే కఠిన చర్యలు: ఏవో రమ్యశ్రీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు విక్రయాలు,నిల్వ మరియు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు తక్షణ నిషేధం విధించినందున,నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ మందును అమ్మినా,నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని, లైసెన్సులు రద్దు చేస్తామని ఫర్టిలైజర్ నిర్వాహకులను కమ్మర్ పల్లి మండల వ్యవసాయ అధికారిని టి. రమ్యశ్రీ హెచ్చరించారు.
మంగళవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జె. భూమేశ్వర్ ఫర్టిలైజర్స్,మన గ్రోమోర్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ అధిక మోతాదులో మందును గుర్తించి స్టాఫ్ సేల్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు హానికరమైన కలుపు మందును వాడవద్దని సూచించారు.
నిబంధనలు అతిక్రమించిన డీలర్లు,విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏవో రమ్యశ్రీ హెచ్చరించారు.
