అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

నివాళులు తెలిపిన విద్యార్థినీ విద్యార్థులు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న టి.రాయలు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిత్రులు, కుటుంబ సభ్యులు శ్రద్ధాం జలి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతున్నా మన్నారు. మృతుడు రాయలకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

కాగా కుమారుని వివాహం మరొక ఐదు రోజుల్లో జరగనుండగా శుభలేఖలు కూడా బంధువులకు పంచారని, ఆదివారం రాయలు మృతి చెందడంతో పెండ్లి ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ పాఠశాల ఉపాధ్యాయుడు మృతి చెందడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ చర్యతో అక్కడ వాతావరణం దీనంగా ఏర్పడింది. ఉదయం నుండి పలువురు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply