సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ శ్రీరామ్ సుమలత (అరవింద్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెక్కులు మంజూరైన లబ్ధిదారులు మార్పాక పారిజాత, అన్నేవోయిన కృష్ణవేణి, ధర్పల్లి నర్సయ్య లకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి చెక్కులు అందుకు లబ్ధిదారులు మాట్లాడుతూ… ప్రవేట్ ఆసుపత్రులలో వైద్య చేయించుకొని సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు సహకారం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ లో మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, గ్రామ కాంగ్రెస్ పార్టీలకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా అందుతున్న ఈ సహాయం ఎంతో ఉపయోగపడేలా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అవసరమైన వర్గాలకు ప్రజలకు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రతి అర్హుడికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రాహుల్, గ్రామ శాఖ అధ్యక్షుడు భీమ్ రవీందర్ , గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
