Telangana | క‌విత ఎత్తుగ‌డ ఏమిటో?

Telangana | క‌విత ఎత్తుగ‌డ ఏమిటో?

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కొత్త పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిజీగా ఉన్నారు. అయితే ఆమె పెట్ట‌బోయే పార్టీ పేరు ఏమిటా అని జ‌నాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కొత్తగా పార్టీ పేరు.. కొత్త ఎజెండాతో క‌విత ప్ర‌జ‌ల్లోకి వెళ్తుందేమో అని అంతా భావించారు. కానీ ఆమె పాత పేరుతో కొత్త‌గా ముందుకు వెళ్లాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త పార్టీకి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి క‌లిగిస్తున్నాయి. తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టేందుకు కవిత, జాగృతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి కేసీఆర్ మొద‌ట స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును క‌విత వాడుకోవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ కూడా తనకు వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.పాత పేరు, కొత్త జెండా, అజెండాతో ప్రజల ముందుకు వస్తానని చెప్పడంతో జ‌నాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తన కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత తాజాగా ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వచ్చే నెల 25వ తేదీన తన కొత్త పార్టీ ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం రోజున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ సమాజం భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్తుందని, ఒకవేళ పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టినా జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు క‌విత క్లారిటీ ఇచ్చింది. రిజ‌ర్వేష‌న్లు క‌లిసి వ‌స్తే సిద్దిపేట, గజ్వేల్, నిజామాబాద్ నుంచి తాను పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు స్ప‌ష్టం చేశారు.

Leave a Reply