సుంకెనపల్లిలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

చిట్యాల, ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు మరువలేనివని సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి సర్పంచ్ సునీత యాదయ్య అన్నారు. చిట్యాల మండలం లోని సుంకేనపల్లి గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పంచాయతీ దగ్గర జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య మాట్లాడుతూ మాజీ ప్రధాని దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply