విజ‌య‌వంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్…

విజ‌య‌వంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్…

మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ​మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో శనివారం ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘కోవాలెంట్ ల్యాబొరేటరీస్’ ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ​ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.

కోవాలెంట్ ల్యాబొరేటరీస్ హెచ్‌ఆర్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్, అసిస్టెంట్ హెచ్‌ఆర్ శ్రీ మహేష్‌ నేతృత్వంలో ఇంటర్వ్యూలు నిర్వహించగా, లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LSSSDC) తెలంగాణ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ కుమార స్వామి, కమ్యూనిటీ ఫార్మా మొబిలైజర్ శ్రీ సంపత్ విజయరాజులు ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. ​ఇదే సందర్భంగా, భవిష్యత్తులో విద్యార్థులకు మరింత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాజమాన్యం మరియు LSSSDC మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ​

ఈ విజయవంతమైన కార్యక్రమం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ డా. ఎస్. శ్రీధర్, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్లు డా. వల్లీ కుమారి, శ్రీమతి ఎస్. శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి తమ కళాశాల నిరంతరం కృషి చేస్తోందని, ఇలాంటి కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమ విజయానికి సహకరించిన అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు.

Leave a Reply