ప్రశాంత్‌కు యూకే ఎన్నారై కన్వీనర్ పదవి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక కు చెందిన యువ నాయకుడు ప్రశాంత్ మామిడాల ను యూకే ఎన్నారై యూత్ వింగ్ నేషనల్ కన్వీనర్ గా నియమితులయ్యారు. యూకే లో బిఆర్ఎస్ ఎన్నారై యూత్ విభాగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రశాంత్ ను ఆ పార్టీ యూత్ వింగ్ నేషనల్ కన్వీనర్ గా నియమించింది. తనపై నమ్మకంతో నియమించిన పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులకు ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు. కన్వీనర్ పదవిని పొందిన ప్రశాంత్ కు పలువురు అభినందనలు తెలిపారు.
