Refilling | నలుగురు అక్కడికక్కడే మృతి..

Refilling | నలుగురు అక్కడికక్కడే మృతి..

Refilling | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో ఘోర పేలుడు సంభవించింది. సిల్వాస్సాలోని నైట్రోజన్ గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవాళ జరిగిన ఈ దుర్ఘటన సిల్వాస్సాలోని గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్‌లో చోటుచేసుకుంది. సిలిండర్లను రీఫిల్ చేస్తున్న సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు శబ్దంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. స్థానికులు తీవ్ర భయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply