ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి.

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి.

ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్.

పాయకాపురం, ఆంధ్రప్రభ : దేవుని రాకడకు ప్రాముఖ్యమైన ఘడియలలోకి ప్రపంచం వచ్చి చేరిందని, ఒకవైపు యుద్ద వాతావరణం, మరొక వైపు వివిధ రకాల నయం కానీ రోగాలు దాపురించాయని ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయని ప్రతిఒక్కరూ ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయాలని ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్ క్రైస్తవ సంఘాలను కోరారు.

సింగ్ నగర్లోని ఆయన కార్యాలయంలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని దేవుడు సర్వమానవాళి కొరకు తన రక్తం చిందించిన విషయాన్ని గుర్తు చేస్తూ,అమ్మలరా నాకొరకు ఏడ్వవద్దు,మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్వాండి అని పలికిన మాటలు గుర్తు చేశారు. ప్రపంచం కొరకు,దేశం,రాష్ట్రం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి క్రైస్తవ సహోదరులు ప్రార్ధనలు చేయాలని ఆయన కోరారు.

Leave a Reply