College | మనస్తాపానికి గురై…

College | మనస్తాపానికి గురై…

College | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని మల్లాడిహళ్లి రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల అవమానం భరించలేక మానసికంగా కృంగిపోయిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

బీఏఎంఎస్ చివరి సంవత్సరం చదువుతున్న నిఖిత (22) అనే విద్యార్థిని, తనపై వ్యాప్తి చేసిన అపవాదుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. తోటి విద్యార్థులు ఆమెకు ప్రొఫెసర్‌తో అనుచిత సంబంధం ఉందని తప్పుడు ప్రచారం సృష్టించి ప్రచారం చేశారని సమాచారం.

నిఖిత తన లెక్చరర్ డాక్టర్ రాజుతో చదువు విషయంలో తరచూ మాట్లాడేదని, దీనిని తప్పుగా అర్థం చేసుకుని కొందరు సహ విద్యార్థులు అపోహలు కల్పించారని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును కాలేజీ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ జీఎన్‌కు అందజేశారు. ఈ ఘటనతో కళాశాలలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతితో సహ విద్యార్థులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply